వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకొని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై రఘురాముని దర్శించుకున్నారు. ఊరేగింపుతో రాయపర్తిలో సందడి వాతావరణం నెలకొంది.
ఇవీ చూడండి: కన్నుల పండువగా సీతారాముల కల్యాణం