Police Rescued Old Woman in Narsampet : ప్రమాదవశాత్తు బావిలో పడిన మతిస్థిమితం సరిగా లేని ఓ వృద్దురాలిని పోలీసులు కాపాడారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బొడ్రాయి సమీపంలో నివాసం ఉంటున్న తిరునగరి హరిప్రియ(63) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు బావిలో పడింది. స్థానికుల సమాచారంతో ఎస్సై రాంచరణ్ బావిలో పడిన హరిప్రియను రక్షించడానికి ప్రయత్నాలు చేశారు.
రవి అనే కానిస్టేబుల్ బావిలోకి దిగి వృద్దురాలిని తాళ్ల సాయంతో బయటికి తీశారు. స్వల్ప గాయాలైన వృద్దురాలిని అంబులెన్స్‌లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్దురాలికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఎస్సై రాంచరణ్‌తో పాటు కానిస్టేబుల్ రవిని ఉన్నతాధికారులు అభినందించారు.