వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో డ్రైవర్ సూరి ట్రాక్టర్‌తో పొలం పనులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. డ్రైవర్ ఇంజన్ కింద ఇరుక్కున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్పందించిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఎస్సై ప్రశాంత్ ట్రాక్టర్‌ను తొలగించి డ్రైవర్‌ను ప్రాణాలతో కాపాడారు. అనంతరం గ్రామస్థుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. చనిపోయాడనుకున్న వ్యక్తి ఎస్సై కాపాడరంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీచూడండి: కరోనా ఎఫెక్ట్: హెచ్ఆర్సీ ఇక వారానికి రెండురోజులే!