వరంగల్ గ్రామీణ జిల్లా దామెరలో "అక్షర తెలంగాణకు అంకితమవుదాం" పేరిట పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల ఏసీపీ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టిన అందరికీ విద్య కార్యక్రమాన్ని దామెర పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ్రామంలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు దత్తత తీసుకున్నారు.
ఇవీ చూడండి: 'పోలీసుల తీరును నిరసిస్తూ జైల్భరో నిర్వహిస్తాం'