వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలోని 10వ వార్డులో ఎమ్మెల్యే అరూరి రమేష్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా రానున్న పది రోజులలో డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్దమైన కార్యాచరణ రూపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ముఖ్యంగా డివిజన్లలో వార్డుల వారీగా పారుశుద్ధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల మరమ్మత్తు, మురుగు కాలువలను శుభ్రం చేయడం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ఇందుకోసం ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: వాహ్ తాజ్: ప్రేమాలయం అందాలకు ట్రంప్ ఫిదా