వరంగల్ గ్రామీణ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.7కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా జిల్లా కలెక్టర్ హరితతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మినీ డైరీ ఏర్పాటు చేయనున్నామని, నిరుపేద ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.
పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే.. ఇతర జిల్లాల్లో కూడా ఈ పథకం ప్రవేశపెట్టే ఆలోచనపో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. మరో 10 రోజుల్లో లబ్ధిదారులకు మినీ డైరీ గేదలను అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీఎం సత్యజిత్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆత్మకూర్ జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, దామెర జడ్పీటీసీ గరిగె కల్పనాకృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు