విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ అవసరమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెరా మండలంలోని ఒగ్లపూర్లో జరిగిన రాష్ట్ర సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ త్రో బాల్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. క్రమశిక్షణ లేని విద్యార్థి ఎంత చదివిన వృథానని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఉత్తర్ప్రదేశ్లో మహిళలకు చోటేది: ప్రియాంక గాంధీ