వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతు సమన్వయ సమితి పట్టణ అధ్యక్షుడు దగ్గు విజేందర్ రావు పాలాభిషేకం చేశారు. రెక్కాడితేగాని డొక్కాడని రైతన్నల పాలిట సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని పేర్కొన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు రోజుల తరబడి తిరిగేవారని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో తెరాస సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువులు, విత్తనాలకు కొదవ లేకుండా చేశారన్నారు. ఎకరానికి రూ.10వేల రైతుబంధు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ బొచ్చు వినయ్ , మున్సిపాలిటీ ఛైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొన్నారు.