తాను శాసన సభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి నర్సంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. 200 కోట్ల వ్యయంతో నియోజకవర్గాన్ని మోడల్ సిటీగా రూపొందించేందుకు పనులు వేగవంతం చేశామని పేర్కొన్నారు. మరికొన్ని పనుల టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. నర్సంపేట మోడల్ సిటీకి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రచారపత్రం విడుదల చేశామన్నారు. ఈ బ్రౌచర్ ప్రతి గడపను తాకేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డికి పలువురు నేతల సంతాపం