వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ మండలంలోని స్నేహ గోదాంను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించారు. అక్కడ మొక్కజొన్న పంట రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంటను అమ్మటానికి మూడు రోజుల సమయం పడుతోందని రైతులు వాపోయారు. తినటానికి తిండిలేక బాధపడుతున్నట్లు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. చలించిపోయిన ఆయన వారికి భోజన సౌకర్యం కల్పించారు. రైతులు అక్కడ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు వారికి రోజుకు రెండు పూటలా భోజనాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
రైతన్నకు అండగా నిలిచిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండలో మొక్కజొన్న పంటను అమ్మేందుకు గోదాం వచ్చిన రైతులకు అన్నదాన కార్యక్రామాన్ని నిర్వహించారు.