రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడమే లక్ష్యంగా తలపెట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ రూరల్ జిల్లాలో ప్రారంభించారు. గీసుకొండ మండలం మరియాపురం క్రాస్ వద్ద పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి మొక్కలు నాటారు.
అనంతరం మరియాపురం నుంచి చేలపర్తి వరకు సుమారు 14 కిలో మీటర్ల మేర మొక్కలు నాటేలా కార్యకర్తలకు, అధికారులకు పలు సూచనలు చేశారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు.
ఇదీచూడండి: నర్సాపూర్ అడవులు: ఎన్నో అందాలు.. మరెన్నో ప్రత్యేకతలు