మాస్కులు ధరించి, భౌతికదూరం పాటిస్తూ... ఉపాధి పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కూలీలకు సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్నగర్ శివారు టూక్యా తండాలో ఉపాధి పనులు పరిశీలించారు. పనులు ఎలా జరుగుతున్నాయని, ఏఏ పనులు చేస్తున్నారని కూలీలను అడిగి తెలుసుకున్నారు.
వలస కార్మికుల ద్వారా గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మాస్కులు లేని వారికి మంత్రి పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి నివారణకు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కూలీలను కోరారు.
ఇదీ చూడండి: విష ప్రయోగం.. ఎనిమిది నెమళ్లు మృతి