వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి వరంగల్ రూరల్ జిల్లాలోని దామెర గ్రామాన్ని సందర్శించారు. పల్లెలో జరుగుతోన్న ప్రగతి పనులను పరిశీలించారు. చెత్తను ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన వైకుంఠధామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: HARISH: మంత్రి హరీశ్‌రావు కాన్వాయ్‌కు ప్రమాదం