ETV Bharat / state

ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్​ రూరల్​ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

minister errabelli  dayakar rao visited inavolu sri mallikarjuna swamy temple in warangal rural district
ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Mar 11, 2021, 11:30 AM IST

వరంగల్​ రూరల్​ జిల్లా ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామివారిని పంచాయతీరాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుల వేదమంత్రోతచ్ఛరణల మధ్య ఆశీర్వచనాలు అందుకున్నారు. పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. శివపార్వతుల ఆశీర్వచనాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

minister errabelli  dayakar rao visited inavolu sri mallikarjuna swamy temple in warangal rural district
ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు విజయవంతం అవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. దేవాలయాల జీర్ణోద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, అర్చకులకు జీతభత్యాల పెంపు, అర్చకుల వయో పరిమితి పెంపు, యాదాద్రి అభివృద్ధి పనులతో దేవాలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి చెప్పారు. ఐనవోలు వచ్చిన భక్తుల అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ నిర్వాహకులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చూడండి: రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.