వరంగల్ గ్రామీణ జిల్లాలో పర్యటించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... రాయపర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యులుగా చేస్తూ.... ప్రతీ గ్రామంలో మొక్కలు నాటాలని ప్రజాప్రతినిధులను ఎర్రబెల్లి ఆదేశించారు.
14వ ఫైనాన్స్ నిధులు రూ. 5 లక్షలతో పూర్తి చేసిన హైమాస్ లైట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం మైలారం సబ్ స్టేషన్ నుంచి జయరాం తండ వరకు రూ. 40 లక్షల ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 1000 కోట్ల నిధులతో కల్లాలు, రూ. 500 కోట్ల నిధులతో రైతు వేదికలు ఏర్పాటు చేస్తూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఒకటి చొప్పున 40 వేల మెట్రిక్ టన్నుల పంటను నిల్వ చేసే సామర్ధ్యం గల గోదాముల నిర్మాణాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు.
ఇదీ చూడండి: భారత గగనతలంలోకి పాక్ డ్రోన్.. కూల్చిన భద్రతా దళాలు