వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాసం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ రైతుబంధు నిధులు రూ.7వేల కోట్లు, 25వేలలోపు రుణాల ఏకమొత్తం మాఫీ కోసం రూ.1200 కోట్లు, ఉపాధి హామీ హామీ కూలీల కోసం రూ.170 కోట్లు విడుదల చేశారని వారికి తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రజల పట్ల నిబద్ధతను, నిజాయితీని ప్రజలకు వివరించే బాధ్యతను ప్రజాప్రతినిధులు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.
ఈ మేరకు మంత్రి ఎర్రబెల్లి శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పర్వతగిరి నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేస్తూ లాక్డౌన్ ముందుగా ప్రకటించడమే గాకుండా, రైతుల పంటలను కొనుగోలు చేస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్‌దే అన్నారు. అలాగే ఉపాధి హామీకి, రైతు బంధుకి, రైతుల రుణమాఫీకి నిధులు మంజూరు చేసి, తన నిజాయితీని, నిబద్ధతని చాటుకున్నారని అన్నారు. వారి ముందు చూపు, పరిపాలనా దక్షతకు ఇది నిదర్శనమని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: కేంద్రం, ఐసీఎంఆర్ సూచనల ప్రకారమే పరీక్షలు: ఈటల