శ్యాం ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం పైలట్ ప్రాజెక్ట్‌గా వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలాన్ని తీసుకున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఈ పథకం పనులపై హన్మకొండలోని కలెక్టరేట్లో అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. పర్వతగిరి మండలాన్ని ఈ పథకం కింద అన్ని విధాల అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడంతో పాటు కుటీర పరిశ్రమలు, కుల వృత్తుల ద్వారా అందరికీ జీవనోపాధి కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. మంజూరైన పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తయ్యేలా వివిధ శాఖల అధికారులు, పనుల సమన్వయాన్ని కలెక్టర్ చూడాలని కోరారు.
ఈ సమావేశంలో కలెక్టర్ హరిత, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, వర్థన్నపేట ఎమ్మెల్యే రమేష్, పంచాయతీరాజ్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కవిత జయభేరీ.. ఆనందంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి డ్యాన్స్