వరంగల్‌లోని రంగలీల మైదానంలో రావణ వధ వేడుక ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, బల్దియా మేయర్ గుండా ప్రకాశ్ హాజరయ్యారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి వేడుకలను నిర్వహించుకుంటామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో రావణ వధ కార్యక్రమాన్ని నిరాడంబరంగా నిర్వహించామని తెలిపారు.
ఇదీ చూడండి: కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారికి తెప్పోత్సవం