రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తోంటే... అడ్డు పడుతున్నారని విపక్షాలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో రెండు ఎలక్ట్రిక్ ఆటోలు అందించారు. 45 మందికి రూ.44 లక్షల 80 వేల విలువైన కల్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 9 మందికి 4 లక్షల 28 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు.
30 మంది అంగన్వాడీ టీచర్లకు యూనిఫార్మ్లతో పాటు ముగ్గురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను మంత్రి అందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రానున్న ఎన్నికల్లో... విమర్శించే వారికి కాదు... పనులు చేసే వారికి ఓట్లు వేయాలని ప్రజలను మంత్రి కోరారు.