పట్టణ ప్రగతిలో వార్డు కౌన్సిలర్లతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజయ్యారు. పట్టణంలోని వార్డులను పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత వార్డు కౌన్సిలర్లేదని ఆయన అన్నారు. పట్టణ ప్రణాళిక పది రోజుల్లో పూర్తి అయ్యేది కాదని.. ఈ కార్యక్రమాన్ని ప్రజలు నిరంతరం కొనసాగించాలని మంత్రి అన్నారు.
నర్సంపేట అభివృద్ధి కోసం రూ. 50 కోట్లు నిధులు ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి వార్డు శుభ్రంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నగర పంచాయతీ ఛైర్పర్సన్ గుంటి రజిని, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు..