సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అంగన్వాడీ కార్యకర్తలకు 30 శాతం గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రికి వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ వైస్‌ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
గతంలో ఎవరూ కూడా ఈ తరహాలో ప్రజాప్రతినిధులకు గౌరవవేతనం ఇచ్చిన దాఖలాలు లేవని... కేసీఆర్ మాత్రమే గౌరవవేతనం చెల్లించారని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరింత ఉత్సాహంతో అందరం కలిసి పనిచేస్తామన్నారు.
ఇదీ చూడండి: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో తెరాస, ఈటల వర్గాల మధ్య రసాభాస