ETV Bharat / state

పోలీసులకు వైద్య పరీక్షలు, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ - పరకాల ఏసీపీ శ్రీనివాస్

లాక్​డౌన్​ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేటలో విధులు నిర్వహించిన పోలీసు సిబ్బందిని పరకాల ఏసీపీ శ్రీనివాస్ కలిశారు. వారికి వైద్య పరీక్షలు చేయించి హైడ్రో క్లోరోక్విన్ టాబ్లెట్స్​ అందజేశారు. మండలంలో ఉన్న రౌడీషీటర్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు.

Medical checkups for the police and counseling for rowdy sheeters at shayampet warangal rural
పోలీసులకు వైద్య పరీక్షలు, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
author img

By

Published : May 13, 2020, 5:32 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట పోలీస్ స్టేషన్​ను పరకాల ఏసీపీ శ్రీనివాస్ సందర్శించారు. సిబ్బంది అందరికీ డాక్టర్ నాగ శశికాంత్, వారి బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించి హైడ్రో క్లోరోక్విన్ టాబ్లెట్స్​ ఇచ్చారు. ఆ తర్వాత సిబ్బంది అందరికీ సీపీ ఆదేశాలను, సూచనలను, పంచ సూత్రాలను తెలియజేశారు.

మండలంలో ఉన్న రౌడీషీటర్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఏ రౌడీషీటర్ కూడా ఏలాంటి సంఘవిద్రోహ చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు. భూ పంచాయతీలు, తగాదాల్లో తలదూర్చకూడదని సూచించారు. క్రమశిక్షణ కలిగి ఎవరి పనులు వారు చేసుకోవాలన్నారు. లాక్​డౌన్ సమయంలో నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. మాస్కులు లేకుండా ఎవరైనా కనిపించినట్లైతే వారిపై కేసు నమోదు చేసి రూ. 1000 ఫైన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్​ రావు, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఈనాడు-ఈటీవీ భారత్ చొరవ.. వలస కూలీలకు ఎర్రబెల్లి చేయూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.