వరంగల్ రూరల్ జిల్లా నడికూడకు చెందిన వేల్పుల రమేశ్ అనే మావోయిస్టు కొరియర్‌ను పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను గత కొంత కాలం నుంచి మావోయిస్టు దామోదర్‌కు కొరియర్‌గా పనిచేస్తూ... మావోయిస్టు పార్టీకి డబ్బులు సరఫరా చేశాడని పోలీసులు తెలిపారు. గతంలో రమేశ్ మావోయిస్టులకు పూర్తి స్థాయిలో సాయం చేశాడని చెప్పారు.
అతనిని అరెస్ట్ చేసే క్రమంలో అతని ఇంట్లో విప్లవ సాహిత్యం, దామోదర్ రాసిన లేఖలు దొరికాయని వెల్లడించారు. ఇలాంటి వారు ఇకనైనా ప్రజల్లో కలిసిపోయి జీవించాలని పోలీసులు కోరారు.
ఇవీ చూడండి: 'సానూకుల ధోరణితో వైరస్‌ను పారదోలుదాం'