ETV Bharat / state

MAOISTS: కరోనా కాటుకు బలవుతున్న అగ్రనేతలు - waranagal news

సీపీఐ మావోయిస్టు పార్టీకి ఇప్పుడు కరోనా రూపంలో మరో పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. గతంలో ఎన్‌కౌంటర్‌ ఘటనల్లో  అగ్ర నాయకత్వాన్ని కోల్పోయి రెండు సార్లు సంక్షోభాన్ని చవిచూడగా.. ప్రస్తుతం కొవిడ్‌ మహమ్మారితో అత్యంత సంక్లిష్టతను ఎదుర్కొంటోంది.

maoist leaders are affected by covid
MAOISTS: కరోనా కాటుకు బలవుతున్న అగ్రనేతలు
author img

By

Published : Jun 26, 2021, 12:36 PM IST

నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ ఉద్యమాల ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నాడు ఉవ్వెత్తున ఎగిశాయి. అప్పటికే వీటి స్ఫూర్తితో విద్యార్థి చైతన్యం వెల్లివిరిసింది. రాడికల్‌ విద్యార్థి సంఘం నేతృత్వంలో పలువురు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. ఆ స్థాయికి చేరుకొన్న నేత కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడు పులి అంజయ్య అలియాస్‌ సాగర్‌ తర్వాత కాలంలో పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు. 1991లో ఈయన ఎన్‌కౌంటర్‌ అప్పట్లో పార్టీకి కోలుకోలేని దెబ్బే.

అనంతరం నల్లా ఆదిరెడ్డి అలియాస్‌ శ్యామ్‌, శీలం నరేశ్‌ అలియాస్‌ మురళి, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్‌ మహేశ్‌ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యుల ఎన్‌కౌంటర్‌ తర్వాత పార్టీ రెండోసారి అలాంటి సంక్షోభాన్ని చవిచూసింది. అనంతర కాలంలోనూ అనేక ఒడుదొడుకులకు లోనైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎదిగిన క్రాంతి రణదేవ్‌ అలియాస్‌ బక్కన్న, గుండెబోయిన అంజయ్య అలియాస్‌ బాలన్న, శెట్టిరాజ పాపయ్య అలియాస్‌ సోమన్న, గాజర్ల సారయ్య అలియాస్‌ ఆజాద్‌, తిప్పారపు రాములు అలియాస్‌ తాత, ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన బడే నాగేశ్వర్‌రావు అలియాస్‌ ప్రభాకర్‌ లాంటి నాయకులు వేర్వేరు సందర్భాల్లో ఎన్‌కౌంటర్లకు గురవ్వడంతో పార్టీ పెను సంక్షోభంలో కూరుకుపోయినా ఎప్పటికప్పుడు కొత్త నాయకత్వం ఆ లోటును భర్తీ చేస్తూ వస్తోంది.

ఇక తాజా పరిస్థితులను గమనిస్తే రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ కేంద్ర కమిటీలోనూ సభ్యుడిగా కీలక పాత్ర పోషిస్తున్న యాప నారాయణ అలియాస్‌ హరిభూషన్‌ అలియాస్‌ లక్మాదాదా కరోనా కాటుతో మృత్యువాత పడ్డారు. ఈయతోపాటు ఇటీవల రాష్ట్ర కమిటీకి చెందిన మరో సభ్యుడు కత్తి మోహన్‌రావు అలియాస్‌ ప్రకాశ్‌, మాడ్‌ ఏరియా కమిటీ కార్యదర్శి సారక్క అలియాస్‌ భారతక్క సైతం మరణించడం ఆందోళన కలిగిస్తోంది. ఆరు నెలల క్రితం దండకారణ్య కార్యదర్శి, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన రావుల శ్రీనివాస్‌ అలియాస్‌ రామన్న గుండెపోటుతో కన్నుమూయడం పార్టీని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ఇంకా అనేక మంది..

రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలో పనిచేస్తున్న పలువురు కొవిడ్‌ కోరల్లో చిక్కుకున్నట్టు ప్రచారం సాగుతోంది. కరోనా మొదటి దశ ప్రభావం మావోయిస్టు నేతలపై పడకున్నా రెండో దశలో మాత్రం వరుసగా పలువురు కన్నుమూయడం పార్టీకి కొత్త సవాలును విసురుతోంది. అటవీ ప్రాంతాల్లో కొవిడ్‌ నిర్ధారణ చేసుకోలేక, ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడానికి వస్తే పోలీసుల చేతికి చిక్కుతున్న నేతలకు దిక్కు తోచని పరిస్థితి ఎదురవుతోంది. దశాబ్ద కాలంగా మైదాన ప్రాంతాల్లో నియామకాలు అరకొరగానే సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతాల్లోని ఆదివాసీలే ఆకర్షితులవుతూ పార్టీలో చేరుతున్నారు. ఈ చేరికల ఫలితమే హరిభూషణ్‌ వంటి ఒక ఆదివాసీ వర్గానికి చెందినవాడు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడని ఒక వాదన ఉంది. రాష్ట్ర కమిటీలోనూ బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ కూడా ఆదివాసే. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో వందల సంఖ్యలో కోయ, గొత్తికోయ యువతీయువకులు దళాల్లో ఎక్కువగా చేరడానికి హరిభూషణ్‌తోపాటు హిడ్మా లాంటి ఆదివాసీ అగ్రనేతల ప్రోత్సాహమే అని మరో వాదన.

తర్వాత వీళ్లేనా?

ప్రస్తుతం హరిభూషణ్‌ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించగా ఉమ్మడి వరంగల్‌కే చెందిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ , ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన బండి ప్రకాశ్‌, అడెల్లు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన కంకణాల రాజిరెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న మార్గనిర్దేశంలో నడుస్తోంది. ప్రస్తుతం హరిభూషణ్‌ స్థానాన్ని ఈ సభ్యుల్లోనే ఒకరితో పార్టీ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. పార్టీ ప్రాబల్యం, విస్తరణ అంతా ఆదివాసీ ప్రాంతాల్లోనే మనుగడ సాగిస్తుండడంతో అదే వర్గానికి చెందిన బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ కీలకంగా మారే అవకాశం ఉంది. ఓరుగల్లుకు చెందిన మరికొందరు సీనియర్‌ నేతలు కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిలో గాజర్ల రవి అలియాస్‌ గణేశ్‌ ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఉండగా, ముప్పిడి సాంబయ్య అలియాస్‌ బాబన్న, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న, పవనానందరెడ్డి అలియాస్‌ శ్యాం, మాచర్ల ఏసోబు, కొంకటి వెంకట్‌ దండకారణ్యంతోపాటు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. చందర్‌ అనే నాయకుడు ఛత్తీస్‌గఢ్‌లోని పార్టీ సాంస్కృతిక విభాగం బాధ్యులుగా ఉన్నారు. కోడి మంజుల, జ్యోతక్క, భాను, రాజ్‌మన్‌, సుధాకర్‌, కుమార్‌ తదితరులు రెండు దశాబ్దాలుగా అజ్ఞాతంలో వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నట్టుగా నిఘా వర్గాల అంచనా.

ఇదీ చూడండి: నిషాలో హైదరాబాద్.. పర్యాటక కేంద్రాలే యువత స్పాట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.