వరంగల్ గ్రామీణ జిల్లాలో మూడేళ్ల కిందట నూతనంగా ఏర్పడిన దామెర మండల తహసీల్దార్ కార్యాలయానికి శాశ్వత భవనం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని గమనించిన ఆ గ్రామానికి చెందిన కాసర్ల వంశస్థులు సుమారు రూ. 2 కోట్లు విలువ చేసే రెండెకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చి తమ ఉదాసీనతను చాటుకుటున్నారు.
గ్రామంలో దాదాపు 25 ఎకరాల భూమి కలిగిన కాసర్ల వంశస్థులు ప్రస్తుతానికి హన్మకొండలో నివాసం ఉంటున్నారు. సోమవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, దామెర మండల తహసీల్దార్ రజిని సమక్షంలో భూమిని విరాళంగా అందించారు.
దాతలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. గతంలో కూడా ఈ వంశస్థులు గ్రామంలో సబ్స్టేషన్ నిర్మాణానికి కొంత భూమిని విరాళంగా ఇవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'రెండు పడకల గదుల ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారు..?'