ETV Bharat / state

KTR Speech At Hanumakonda Public Meeting : 'తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయం' - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు

KTR Speech At Hanumakonda Public Meeting : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మంత్రి కేటీఆర్ జిల్లాల పర్యటనల్లో జోరు పెంచారు. ఇటీవలే వరంగల్‌లో రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి.. మరోమారు ఈరోజు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్న మంత్రి.. తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు.

KTR Speech At Warangal Public Meeting
KTR Speech At Warangal
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 4:54 PM IST

Updated : Oct 9, 2023, 6:22 PM IST

KTR Speech At Hanumakonda Public Meeting తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయం

KTR Speech At Hanumakonda Public Meeting : తెలంగాణలో కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వడం ఖాయమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. ఎన్నికల టూరిస్టులు వస్తారు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ ట్రాక్ రికార్డు, తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ ట్రాక్ రికార్డు మీ ముందే ఉందని ఎవరి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలే గమనించాలని మంత్రి కోరారు. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మంత్రి కేటీఆర్ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌, పోలీస్‌ కార్యాలయం, డబుల్‌ బెడ్‌ రూమ్(Double Bedroom Houses) ఇళ్లను మంత్రి ప్రారంభించారు.

Minister KTR Hanumakonda Tour : ఈ నెల 6వ తేదీన వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలో రూ.900 కోట్ల కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్.. నాలుగు రోజులు కూడా గడవక ముందే.. మరోసారి జిల్లాకు విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో కేటీఆర్‌ భూపాలపల్లికి చేరుకున్నారు. ముందుగా నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.59 కోట్ల 45 లక్షల వ్యయంతో సకల సౌకర్యాలు, అధునాతన హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని.. జిల్లా కలెక్టరేట్ విద్యుద్దీపాలతో ధగధగలాడింది.

KTR on Telangana Congress Six Guarantees : 'గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్ అయింది'

'ఎన్నికల టూరిస్టులు వస్తారు జాగ్రత్తగా ఉండాలి. పరకాలలో ధర్మారెడ్డిని 70 వేల మెజార్టీతో గెలిపించాలి. నాటి కాంగ్రెస్‌.. నేటి బీఆర్ఎస్ పాలనను సమీక్షించుకోండి. రాష్ట్రం రాకముందు కరెంట్, నీళ్ల పరిస్థితి ఆలోచించాలి. కేసీఆర్‌ మూడోసారి సీఎం అవ్వడం ఖాయం.' -కేటీఆర్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి

అలాగే హనుమకొండ జిల్లా పరకాలలో రూ.4.85 కోట్లతో నిర్మించిన మున్సిపాలిటీ భవనానికి, రూ.2.15 కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని, రూ.2.80 కోట్లతో నిర్మించిన ఆర్డీవో కార్యాలయ భవనాలను.. కేటీఆర్ ప్రారంభించారు. మరో రూ.114 కోట్ల అభివృద్ధి పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. పరకాలలో ధర్మారెడ్డిని 70 వేల మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. నాటి కాంగ్రెస్‌.. నేటి బీఆర్ఎస్ పాలనను సమీక్షించుకోండని తెలిపారు. రాష్ట్రం రాకముందు కరెంట్, నీళ్ల పరిస్థితి ఆలోచించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

KTR on Telangana Development : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్లు, పేదింటి ఆడబిడ్డకు కళ్యాణి లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొనియాడారు. అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోమారు ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

Minister KTR Warangal Tour : 'పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు'

KTR Warangal Tour Today : నేడు ఓరుగల్లులో మంత్రి కేటీఆర్ పర్యటన.. వారంలో ఇది రెండోసారి

Last Updated : Oct 9, 2023, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.