ETV Bharat / state

ఏప్రిల్ 20న జరిగే కేటీఆర్ సభాస్థలి పరిశీలన - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు

మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బహిరంగ కోసం నిర్వహించనున్న సభాస్థలిని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు.

MLA Dasyam Vinay Bhaskar
ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
author img

By

Published : Apr 17, 2022, 9:37 PM IST

ఈ నెల 20వ తేదీన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. భారీ బహిరంగ సభ కోసం హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానాన్ని ఎమ్యెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.

వరంగల్‌ పశ్చిమ, తూర్పు, నర్సంపేట నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. వాటితో పాటు పలుచోట్ల శంకుస్థాపనలు చేస్తారన్నారు. తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలన్నారు. మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్షించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వినయ్ భాస్కర్ తెలియజేశారు.

ఇదీ చదవండి: తెరాస, కాంగ్రెస్​ పొత్తుపై మాణిక్కం క్లారిటీ...

'భాజపాతో కాంగ్రెస్ సీనియర్ల కుమ్మక్కు- మీ పార్టీలో ఇక నేనుండను!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.