వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు భరోసాగా కల్పించారన్నారు.
మహిళల సంరక్షణ కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ బిల్లా శ్రీకాంత్, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ సోల్తీ భూమత-రామస్వామి నాయకులు, సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మరోమారు భూముల క్రమబద్ధీకరణకు అవకాశం