నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల వ్యాపారులకు అవగాహన సదస్సును నిర్వహించారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దుకాణల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: 'లాక్డౌన్ను త్వరగా ముగించాలంటే అదొక్కటే మార్గం'