వరంగల్ గ్రామీణ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన వరి ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. జిల్లాలోని దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. నల్లబెల్లి మండలం మేడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో మక్కలు, వడ్లు తడిసిపోయాయి. ఖానాపురం మండలం ధర్మరావు పేట అశోక్‌నగర్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది.
దుగ్గొండి మండలం వెంకటాపురంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సైతం వర్షానికి వరి ధాన్యం తడిసిపోయింది. ఉదయాన్నే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని... ప్రభుత్వమే ప్రతీ గింజ కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.