వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం జయరాంతండా, శివరాంతండా, బాలునాయక్ తండాల్లో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 5 లీటర్ల గుడుంబా, 150 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని పారబోశారు. ఇద్దరు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నా... క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. నిరంతరం ఎక్కడో చోట గుడుంబా తయారీ జరుగుతూనే ఉంది. మరింత ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఆబ్కారీ వారు దాడులు చేస్తూనే ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారవుతూనే ఉంది. తండాలలోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి వాటిని పారబోశారు.