వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని 21వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ ప్రగతిలో భాగంగా చెత్తను ఒక దగ్గర వేసి తగలబెడుతుండగా ఆనందం అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలకు మంటలు అంటుకున్నాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఇంటికి మంటలు అంటుకోకుండా చూశారు. అప్పటికే వాహనాలు దగ్ధమయ్యాయి.
చెత్త తగలబెడుతుండగా నిప్పు రవ్వలు ఎగిరి పడి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆనందం అనారోగ్య కారణాల వల్ల ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లారు.