ఇటు అధికారులు నిర్లక్ష్యం.. అటు వరుణుడు కనికరించకపోవడం ఫలితంగా అన్నదాత పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కళ్లెదుటే తడిసిపోతున్నా.. కన్నీరు పెట్టడం మినహా ఏం చేయలేని స్థితిలో వరంగల్ గ్రామీణ జిల్లా రైతులు.
ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రం వద్ద అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టార్ఫాలిన్లు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. వర్షం వస్తే పక్క గదుల్లోకి మార్చాలని ఉచిత సలహాలిస్తున్నారని.. హామాలీల ఖర్చులు భరించలేకపోతున్నామన్నారు.
వరుస క్రమంలో టోకన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నా.. బంధు ప్రీతి చూపిస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవీచూడండి: '200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'