వరంగల్ గ్రామీణ జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమం పండుగలా సాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో హరితహారంలో భాగంగా జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొని మొక్కలు నాటారు.
ఊరచెరువు కట్ట వద్ద 400 ఈత చెట్లను నాటే కార్యక్రమంలో సూపరింటెండెంట్ పాల్గొని.. అనంతరం ఒక్కో సిబ్బందితో ఆయన ఆరు మొక్కలు నాటించారు. ప్రతి ఒక్కరూ హరితహారం కార్యక్రమంలో పాల్గంటూ.. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.