వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఒకటో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దుబాసి వెంకటస్వామి తెలిపారు. గతంలో పనిచేసిన కౌన్సిలర్లు కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. పరకాలలోని అన్ని ప్రాంతాల్లో తాగు నీరు వస్తోందని... తమ వార్డుకు రాకపోవడం మాజీ కౌన్సిలర్ల చేతగానితనమేనని మండిపడ్డారు.
తనను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా ఉంటానని వెల్లడించారు. ఒకటో వార్డులో చేతి గుర్తుపై ఓటేయాలని ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ ఇనుగల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కేంద్రం చేసింది గుండు సున్నా: కేటీఆర్