ETV Bharat / state

crop damage in hanumakonda: మద్దతు ధర రూ.2వేలు చేస్తేనే మేం గట్టెక్కేది.. మొక్కజొన్న రైతుల ఆవేదన - telangana latest news

crop damage in hanumakonda: ఇటీవల వరుసగా కురిసిన వర్షాలతో మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతింది. ఈదురు గాలులు, వడగండ్ల వానకు నేలవాలిన మొక్కజొన్న పంటతో రైతుల నమ్మకం వమ్మవుతోంది. వానకు దెబ్బతిన్నది పోను మిగిలిన పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న రైతులు... వ్యవసాయం జీవితాలకు భరోసా ఇవ్వలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

crop damage in hanumakonda
రూ.2వేలు ఇస్తేనే పెట్టుబడులు చేతికొస్తాయి.. రైతుల ఆవేదన
author img

By

Published : May 8, 2023, 8:03 AM IST

రూ.2వేలు ఇస్తేనే పెట్టుబడులు చేతికొస్తాయి.. రైతుల ఆవేదన

crop damage in hanumakonda district: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొక్కజొన్న పంటలు నేలవాలాయి. చేతికొచ్చే సమయంలో నేలకొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తడిసిన పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కజొన్న నిటారుగా ఉంటే మిషన్ల సహాయంతో కోతలు కోస్తే... కూలీల ఖర్చు తక్కువయ్యేది. కానీ నేలవాలిన మొక్కజొన్నను మెషిన్లు కోయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కూలీల ఖర్చులు పెరిగిపోయి అదనపు భారం అవుతుందని రైతులు చెపుతున్నారు. వానకు దెబ్బతినగా మిగిలిన పంటను కాపాడుకున్న రైతులు వాటిని కల్లాల్లో ఆరోబోసి, అమ్మేందుకు ఎదురుచూస్తున్నారు.

ఒక మనిషి చేయవలసిన పని ఇద్దరు: వర్షాలకు తడిసిన మొక్కజొన్న రంగు మారుతోంది. వీటికి గిట్టుబాటు ధర కల్పించి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వర్షం కారణంగా కిందకు వాలిన మొక్కజొన్న నుంచి కంకులు విరవాలంటే... ఒక మనిషి చేసే పనిని ఇద్దరు చేయాల్సి వస్తోంది. దీంతో రైతులపై కూలీల ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. మొక్కజొన్న కిందపడడంతో ఒక మనిషి చేయవలసిన పని ఇద్దరు చేయాల్సివస్తుందని దీంతో రైతులపై కూలీల ఖర్చు అదనపు భారం పడుతుందని వాపోతున్నారు.

రూ.2వేలు అయితేనే గిట్టుబాటు: ఈ పరిస్థితుల్లో క్వింటాలుకు కనీసం 2వేల రూపాయల ధర అందిస్తే... పెట్టుబడులు తిరిగి చేతికొస్తాయని రైతులు చెబుతున్నారు. లేకపోతే రైతులు భారీగా నష్టపోక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. పలుచోట్ల ఇప్పటికీ చిరుజల్లులు కురుస్తుండడంతో కల్లాల్లో ఆరేసిన పంట మళ్లీ తడుస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చాలాచోట్ల ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు, వెంటనే కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

"ఐకేపీ సెంటర్ ఓపెన్ అయితదని ఎదురుచూస్తున్నాం. కానీ కాలేదు. చాలా రోజుల నుంచి కల్లాల దగ్గరే ఉన్నాం. గింజ నల్లబడుతుోంది. మళ్లీ వర్షం వచ్చే సూచన కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు. మక్క చేను అంతా నేలకొరిగింది. నిటారుగా ఉంటే.. మిషన్​తో కోయించే వాళ్లం. కానీ అది పడిపోవటం వల్ల కూలీల ఖర్చు పెరుగుతోంది. ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి పంట కొనుగోలు చేస్తే బాగుంటుంది. కనీసం మద్దతు ధర రూ.2వేలు ఉంటేనే మాకేమైనా గిట్టుబాటు అవుతుంది. ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి."_రైతులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.