లాక్ డౌన్ కారణంగా.. 24 గంటలు విధులు నిర్వహించిన పోలీసులకు వరంగల్ జిల్లాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వర్ధన్నపేట సర్కిల్ పరిధిలోని పోలీసులందరికి కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు.
వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తి, జాఫర్ ఘడ్ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో.. కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేశారు. రహదారులపై వాహన తనిఖీలు చేసే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది మాస్క్ విధిగా ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరారు.
ఇదీ చూడండి: ఓయూ ప్రహరీ గోడ వద్ద స్థలంలో నిర్మాణంపై కాంగ్రెస్ నిరసన