వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సుమారు 50 ద్విచక్ర వాహనాలతో పరకాల-భూపాల్పల్లి రోడ్డు, హన్మకొండ రోడ్డు, హుజరాబాద్ రోడ్లలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్, దామర మండలం సర్పంచ్ వెంకన్న, పులకుర్తి గ్రామ ఉప సర్పంచ్‌లు పెంచల రాజు, రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : సీఎం ఫాంహౌస్‌లో తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్య