ETV Bharat / state

పరకాల పురపాలిక సర్వ సభ్య సమావేశం రసాభాస - computer operator jobs issue in parakala muncipality warangal district

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల పురపాలిక సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. పురపాలికలో ఇటీవల జరిగిన కంప్యూటర్ ఆపరేటర్​​ అభ్యర్థుల ఎంపికలో తెరాస కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని భాజపా సభ్యులు ఆరోపించారు. ఖండించిన తెరాస కౌన్సిలర్లు.. అవసరమైతే ఓటింగ్​కి సిద్ధమని వాదించారు.

computer operator jobs issue in parakala muncipality warangal district
రసాభాసగా పరకాల పురపాలిక సర్వ సభ్య సమావేశం
author img

By

Published : Oct 10, 2020, 8:00 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలిక సర్వ సభ్య సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేను అనవసరంగా కొంత మంది నిందిస్తున్నారనీ, దానిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెరాస కౌన్సిలరు మాట్లాడటంతో సమావేశం ఉద్రిక్తతకి దారితీసింది.

పురపాలికల్లో ఇటీవల జరిగిన కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థుల ఎంపికలో తెరాసకు చెందిన చదువు రాని కార్యకర్త్తలకు ఉద్యోగాలు ఇచ్చారనీ, చదువుకున్న ఇంజనీరింగ్ అభ్యర్థులను పక్కకు నెట్టారని భాజపా సభ్యులు ఆరోపించారు. దీంతో పురపాలికలో 18 మంది కౌన్సిలర్లం ఉన్నామనీ, కావాలంటే ఉద్యోగాలకు ఓటింగ్ నిర్వహించాలని తెరాస కౌన్సిలర్లు చెప్పారు. 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థుల సమయం వృథా చేసి ఇప్పుడు ఓటింగ్ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని భాజపా వాదనకు దిగింది.

కౌన్సిలర్లు.. తెరాస వాళ్లకే ఉద్యోగాలు ఇస్తాం కానీ, మీకు ఇవ్వాలా అనేసరికి భాజపా సభ్యులు సహనం కోల్పోయారు. విసుగు చెందిన కమిషనర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లు సమావేశం నుంచి బయటికి వెళ్లి పోయారు.

భాజపా సభ్యులు ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు.

రసాభాసగా పరకాల పురపాలిక సర్వ సభ్య సమావేశం

ఇదీ చదవండి: బాక్సాఫీస్ విక్రమార్కుడు.. ఈ దర్శక ధీరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.