వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పురపాలక సంఘం మొదటి సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తయారు చేయాలని వార్డు కౌన్సిలర్లకు కలెక్టర్ సూచించారు. 2020-21 వార్షిక బడ్జెట్‌పై సమీక్షా సమావేశం జరిపారు. ఈ సమావేశానికి వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ అంగోతు అరుణ, కమిషనర్ రవీందర్, వార్డు కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : తందూరి చాయ్... రుచితో పాటు ఆరోగ్యం