వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా నేపథ్యంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిత వార్డును పరిశీలించారు. కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగానే ఆసుపత్రిలో కరోనా వార్డును ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతీ ఒక్కరు ఈ వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. అనంతరం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశాఖ అధికారి మధుసూదన్, ఆర్డీవో హరిసింగ్, నర్సంపేట ఆసుపత్రి సూపరింటెండెంట్ గోపాల్, ఐఎంఏ వైద్యుల బృందం పాల్గొన్నారు.
సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల బృందం బస్స్టేషన్లు, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో పాటలు పాడుతూ కరోనాపై ప్రజలను చైతన్యపరిచారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కళాకారులు తమ పాటల ద్వారా ప్రజలకు అవగాహన కలిపించారు.
ఇవీ చూడండి: ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్ మంజూరు