ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలిస్తున్న రైతులు వేసవి తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కొనుగోలు సెంటర్లలో పరిశుభ్రత పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటించేలా కేంద్రం నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
'వేసవి తీవ్రత దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలి' - ధాన్యం కొనుగోలు కేంద్రం
వరంగల్ రూరల్ జిల్లాలోని పలు మండలాల్లో కలెక్టర్ హరిత పర్యటించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ధాన్యం తరలించే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హరిత సూచించారు.
ధాన్యం తరలించే రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి : కలెక్టర్