వరంగల్ గ్రామీణ జిల్లాలో ప్రభుత్వం నిరుపేదలకు అందించే డబుల్ బెడ్రూం ఇళ్లు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో అర్హులకు అందాల్సిన ఇళ్లను మందుబాబులు బార్లుగా ఉపయోగించుకుంటున్నారని గ్రామానికి చెందిన కుమార స్వామి, సంపత్ తదితరులు తెలిపారు.
ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇంతవరకు అర్హులకు పంపిణీ చేయకపోవడంతో.. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. త్వరితగతిన నిరూపయోగంగా ఉన్న ఇళ్లను అర్హులకు అందించేలా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: సైనికుల సంక్షేమానికి 25 లక్షల విరాళమిచ్చిన ఎస్బీఐ