చిన్నారులు చిట్టి చిట్టి చేతులతో మట్టిగణపతులను తయారు చేశారు. వినాయక చవితి పర్వదినాన మట్టి వినాయకుడినే పూజించమంటూ వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ.. మట్టి గణపయ్య వాడకంపై అవగాహన పెంచేందుకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను పాలనాధికారి హరిత ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, పిల్లల కృషిని హరిత అభినందించారు. జిల్లాలో నీటి వనరులు కలుషితం కాకుండా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండిః ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం