గ్రామాల్లో దళారులకు పత్తిని విక్రయించి రైతులు మోసపోవద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచించారు. నర్సంపేట వ్యవసాయమార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పత్తి రైతులకు మద్ధతు ధర కల్పించడం కోసం నర్సంపేట, నెక్కొండ వ్యవసాయ మార్కెట్లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాల ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పత్తి కొంత రంగుమారే అవకాశమున్నందున సీసీఐ అధికారులు రైతుల పట్ల కనికరం చూపించి మద్ధతు ధర అందించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు సైతం పత్తిలో తేమశాతం 12 కంటే మించకుండా లూజ్ పత్తినే మార్కెట్కు తీసుకురావాలని సూచించారు.
ఇవీ చూడండి: 'ప్రైవేటు సంస్థల్లో ఆధార్ ధ్రువీకరణ చట్టబద్ధమేనా?