కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ సర్కార్ తమ ఖాతాలో వేసుకుని భాజపాను ప్రజల్లో బలహీన పరుస్తోందని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా కేంద్ర సర్కారు తెలంగాణ రాష్ట్రానికి అందించిన పలు అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి తెరాస చేసింది ఏమి లేదని, మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేస్తోందని నేతలు అన్నారు.
కరోనా కట్టడి, మేకిన్ ఇండియా, రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, తదితర అంశాలను గడప గడపకు తిరిగి వివరించారు. తెరాస మాయమాటలు నమ్మొద్దని, ఆరేళ్ల కాలంలో చేసింది శూన్యం అని దుయ్యబట్టారు. ప్రజల ఆమోదంతో 2023లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: మేమెలా బాధ్యులమవుతాం.. గాంధీ వైద్యురాలి ఆవేదన