వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట పట్టణ పోలీస్ స్టేషన్లో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం జరిగింది. వచ్చే ఖరీఫ్ సీజన్లో నకిలీ విత్తనాలు అరికట్టేందుకుగాను ఈ సమావేశం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయించినవారిపై పీడీ యాక్ట్ పెట్టి లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఎరువుల దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండి నకిలీ విత్తనాలకు ఎలాంటి అవకాశం లేకుండా వారి వ్యాపారం సజావుగా చేసుకోవాలని అధికారులు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: యాపిల్ విత్తనాలు తినేశారా? వాటిల్లో విషం ఉంటుందని తెలుసా!