తాబేలు నల్లటి, మట్టి రంగులో ఉండడం మనకు తెలిసిన విషయమే. అప్పుడప్పుడు పసుపు వర్ణంలో కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ దృశ్యం వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్యం తండాలో కనిపించింది.
రాజన్న అనే రైతుకు పొలంలో పసుపుపచ్చ రంగులో ఉన్న తాబేలు కనపడింది. వెంటనే దానిని ఇంటికి తీసుకువచ్చాడు. బంగారు రంగులో మెరిసిపోతున్న ఆ తాబేలును చూసేందుకు గ్రామస్థులు పోటీ పడ్డారు. ఇంటి పరిసరాల్లో నడుస్తూ.. నీటిలో ఆడుకుంటూ.. అందరినీ పిల్ల తాబేలు ఆకట్టుకుంది.
ఇదీ చూడండి : ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. రోడ్డుకు మోక్షం