ETV Bharat / state

నీళ్లు అనుకుని తాగాడు.. ఆ తర్వాత ఏమైందంటే.. - a man Drunk Acid at Warangal Rural District

పాత సీసాలు సేకరించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఆ వ్యక్తి జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో ఈ రోజు పాత బాటిల్స్ సేకరిస్తూ ఉండగా అతనికి ఒక సీసా దొరికింది. అప్పటికే అతనికి దాహం వేసిందే ఏమో ఆ బాటిల్​లోని నీటిని తాగాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

a man Drunk Acid at Warangal Rural District

author img

By

Published : Nov 10, 2022, 3:49 PM IST

చాలా మంది దాహం వేసినప్పుడు నీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ క్రమంలో ఎదైనా నీరు ఉన్న బాటిల్​ కనిపించగానే మూత తీసేసి దాహాన్ని తీర్చుకుంటారు. కానీ కొన్ని సమయాల్లో అందులో తాగే నీరు కాకుండా ఏమైనా హానికారక ద్రవాలు ఉండవచ్చు. ఇలాగే ఓ వ్యక్తి దాహంగా ఉందని.. మంచినీళ్లనుకొని పొరపాటున యాసిడ్‌ తాగాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. వర్ధన్నపేట పట్టణంలోని వంశరాజ్ కాలనీకి చెందిన సాయిలు పాత సీసాలు సేకరించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పాత బాటిల్స్ సేకరిస్తూ ఉండగా ఓ సీసా అతని కంటపడింది. అందులో ఉన్న నీటిని చూసి.. మంచినీళ్లు అనుకొని తాగాడు. కానీ అందులో ఉన్నది యాసిడ్ కావడంతో తీవ్ర అస్వస్థత గురయ్యాడు. దీంతో బాధితుడిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వరంగల్​లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి: మంత్రి సబిత, విద్యాశాఖ అధికారులకు రాజ్‌భవన్ అపాయింట్‌మెంట్

క్రికెటర్ భార్యకు భాజపా టికెట్.. మోర్బీ బాధితుల్ని కాపాడిన వ్యక్తికి ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.