మొక్కలు నాటడం వల్ల వర్షాలు కురవడమే కాకుండా భూగర్భ జలాలు వృద్ధి చెంది భవిష్యత్ తరాలకు నీటి సమస్య రాకుండా ఉంటుందని వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. పెద్దమందడి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి పర్యావరణహిత బ్యాగులు వాడాలని సూచించారు. పాఠశాలలో బాలికలకవసరమైన మౌలిక వసతులు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
- ఇదీ చూడండి : 'నా రాజీనామా పత్రం ముఖ్యమంత్రికి చేరింది'